-
-
Home » Andhra Pradesh » Nellore » Remember parents renunciation
-
కష్టే ఫలీ!
ABN , First Publish Date - 2020-12-31T03:52:11+05:30 IST
విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా నడుచుకోవాలని జనవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సూచించారు.

మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
గూడూరు, డిసెంబరు 30: విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా నడుచుకోవాలని జనవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సూచించారు. స్థానిక ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించుకోవాలన్నారు. కష్టపడితే దేనినైనా సాధించుకోవచ్చునన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు 80శాతం మంది ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు మాట్లాడుతూ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడి చదవాలన్నారు. సమాజంలో ఉన్నతస్థితి సాధించకపోతే గుర్తింపు ఉండదన్నారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య, చైర్‌పర్సన్ వంకి అరవింద, కీర్తివాసన్, నాగ్, అనూప్‌కుమార్‌యాదవ్, అనిల్‌బాబు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ మోహన్, ప్రిన్సిపాల్ లోకనాఽథం, ఏవో జే రామయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగ చేగువేరా ఫౌండేషన్ ప్రతినిధులు మండ్ల సురేష్‌బాబు, ఆదినారాయణ ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం అందజేశారు.