-
-
Home » Andhra Pradesh » Nellore » relief fund
-
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-11-28T04:59:58+05:30 IST
కొవిడ్ విపత్తు నుంచి కోలుకోక ముందే నివర్ తుఫాన్ వెంకటగిరి ప్రజలను అతలాకుతలం చేసిందని, వరదలతో నష్ట పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.

మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
వెంకటగిరి, నవంబరు 27: కొవిడ్ విపత్తు నుంచి కోలుకోక ముందే నివర్ తుఫాన్ వెంకటగిరి ప్రజలను అతలాకుతలం చేసిందని, వరదలతో నష్ట పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పట్టణంలో వరద తాకిడికి గురైన 3,6,12 వార్డుల్లో ఆయన పర్యటించారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో నష్టపోయిన నేతన్నల ఇబ్బందులను తెలుసుకున్నారు. పూట గడవని నిరుపేద చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. నష్టపోయిన చేనేత కార్మికులకు పరిహారంతోపాటు, ప్రతి చేనేత కుటుంబానికి 100 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 6, 12 వార్డుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, బాధితులకు ఆర్థిక సాయం అందించారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. బీరం రాజేశ్వరరావు, శ్రీరామదాసు గంగాధర్, సునుగోటి విశ్వనాథనాయుడు, ప్రహ్లాద్, ఇందిరమ్మ, చలపతి, వెంకటేశ్వర్లు, శేషగిరి, నరసింహులు, మురళీ, మునీంద్ర, శివ తదితరులు ఉన్నారు.