భూసేకరణ పత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2020-11-20T02:33:42+05:30 IST

ఎన్‌హెచ్‌ 71 నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులతో ఆర్డీవో సరోజిని గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

భూసేకరణ పత్రాల పరిశీలన
భూమి ఇచ్చిన రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో సరోజిని

నాయుడుపేట టౌన్‌, నవంబరు 19 : ఎన్‌హెచ్‌ 71 నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులతో ఆర్డీవో సరోజిని గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జువ్వలపాళెం, ఎల్‌ఎసాగరం, విన్నమాల, పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వరకు ఆర్డీవో సరోజిని భూసేకరణ అధికారిగా ఉండటంతో, ఆ గ్రామాల పరిధిలో భూమి ఇచ్చిన రైతుల పత్రాలను పరిశీలించి, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం విషయం చర్చించారు. వ్యవసాయ భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన మొత్తంపై పరిశీలించి న్యాయం చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏవో రవికుమార్‌, భూసేకరణ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T02:33:42+05:30 IST