బక్రీద్‌కు జంతు బలి వద్దు : ఆర్డీవో

ABN , First Publish Date - 2020-08-01T10:42:55+05:30 IST

బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లింలు గోవధ, జంతు బలి వంటివి చేయరాదని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ ..

బక్రీద్‌కు జంతు బలి వద్దు : ఆర్డీవో

నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూలై 31 : బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లింలు గోవధ, జంతు బలి వంటివి చేయరాదని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో వక్ఫ్‌బోర్డు అధికారులు, పలు మసీదుల నిర్వాహుకులు, ముస్లిం పెద్దలతో ఆయన సమీక్షించారు. బక్రీద్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో, సామాజిక దూరంతోపాటు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో జీవహింస చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T10:42:55+05:30 IST