రెడ్‌జోన్లలో రేషన్‌ పకడ్బందీగా పంచుతాం

ABN , First Publish Date - 2020-04-15T10:12:20+05:30 IST

నాయుడుపేట పట్టణంలో రెడ్‌జోన్లుగా ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఇంటింటికీ పకడ్బందీగా

రెడ్‌జోన్లలో రేషన్‌ పకడ్బందీగా పంచుతాం

తహసీల్దారు శ్రీనివాసులు 


నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 14 : నాయుడుపేట పట్టణంలో రెడ్‌జోన్లుగా ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఇంటింటికీ పకడ్బందీగా రేషన్‌ సరుకులను చేర్చేలా చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు. తహసీల్దారు కార్యాలయంలో రేషన్‌ సరుకులను పంపిణీ చేసేందుకు కావాల్సిన గోనుసంచులను మంగళవారం రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ  సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ మిగతా ప్రాంతాల్లో  రేషన్‌దుకాణాల పరిధిలో మూడు 3 కౌంటర్లుగా ఏర్పాటు చేసి భౌతిక దూరాన్ని పాటించి  రద్దీలేకుండా రేషన్‌ సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-04-15T10:12:20+05:30 IST