వేడుకగా అధ్యయనోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-16T05:18:28+05:30 IST
జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం నుంచి అధ్యయనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.
కనువిందు చేసిన రంగనాథుని అలంకారాలు
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 15 : జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం నుంచి అధ్యయనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తల్పగిరి రంగనాఽథస్వామికి స్వర్ణ వైరముడి అలంకారం జరిగింది. అండాళ్ ఆలయంలో ఆళ్వార్ల ఘోష్టిగానం జరిగింది. అనంతరం శ్రీదేవి-భూదేవి సమేత రంగనాథస్వామికి ప్రాకారోత్ససవం నిర్వహించారు. ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, ధర్మకర్తలు, ఈవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మూలాపేటలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలోనూ అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని స్వర్ణవైరముడితో కనుల పండువగా అలంకరించారు. అనంతరం ఆళ్వారుఘోష్టి, దివ్య నాలయర్ ప్రబంధ ఘోష్టి జరిగాయి. ఆలయ చైర్మన్ మన్నెం లక్ష్మినాథ్‌రెడ్డి, ధర్మకర్తలు, సహాయక కమిషనర్ జే శ్రీనివాసరావు, సిబ్బంది పర్యవేక్షించారు.