డివిజన్‌ స్థాయిలో కరోనా పరీక్షలు చేయాలి

ABN , First Publish Date - 2020-07-14T10:48:01+05:30 IST

నెల్లూరు నగరంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున డివిజన్‌ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని..

డివిజన్‌ స్థాయిలో కరోనా పరీక్షలు చేయాలి

సీపీఎం నేత మూలం రమేష్‌


నెల్లూరు(వైద్యం), జూలై 13 : నెల్లూరు నగరంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున  డివిజన్‌ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల కారణంగా నగర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.


పరీక్షల కోసం ప్రభుత్వం జనరల్‌ ఆసుపత్రికి వెళితే సిబ్బంది సెలవుల పేరుతో వెనక్కు పంపించేస్తున్నారని ఆరోపించారు. కరోనా రోగులకు వైద్య సేవలు అందించడానికి తగినంత మంది సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవటం వల్ల వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు కత్తి శ్రీనివాసులు, మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T10:48:01+05:30 IST