నెల్లూరులో రామలింగాపురం అండర్‌ బ్రిడ్జి పున:ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-28T05:14:39+05:30 IST

నెల్లూరు నగరంలోని రామలింగాపురం రైల్వే అండర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలు ఆదివారం పునః ప్రారంభమయ్యాయి.

నెల్లూరులో రామలింగాపురం అండర్‌ బ్రిడ్జి పున:ప్రారంభం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 27 : నెల్లూరు నగరంలోని రామలింగాపురం రైల్వే అండర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలు ఆదివారం పునః ప్రారంభమయ్యాయి. రైల్వే మూడో లైను నిర్మాణ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జి వద్ద అదనంగా వంతెన నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు మొదటి వారంలో అండర్‌ బ్రిడ్జి రోడ్డును మూసేశారు. అప్పటి నుంచి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రామలింగాపురం, హరనాథపురం, ఆదిత్య నగర్‌, రామ్మూర్తినగర్‌, శ్రీహరి నగర్‌, ముత్యాలపాళెం, ధనలక్ష్మీపురం, ముత్తుకూరు వైపు నుంచి వీఆర్సీ సెంటర్‌కు రావాలంటే మాగుంట లేఅవుట్‌కుగానీ, విజయమహల్‌ గేటువైపునకుగానీ వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు అండర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలను పునరుద్ధరించడంతో చుట్టూ తిరగడం తగ్గిందని వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Updated Date - 2020-12-28T05:14:39+05:30 IST