నేడు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల ర్యాలీ

ABN , First Publish Date - 2020-11-16T04:08:47+05:30 IST

విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు, కార్మికులు తరలిరావాలని ఏపీ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు పిలుపునిచ్చారు.

నేడు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల ర్యాలీ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ నేతలు

ఏపీ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ

నెల్లూరు(జడ్పీ), నవంబరు 15 : విద్యుత్‌ శాఖ ఉద్యోగులు,  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు, కార్మికులు తరలిరావాలని  ఏపీ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్‌ భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకర ణను ఉపసంహరించుకోవాలన్నా రు. ఆర్డీపీపీ, కృష్ణపట్నం, విజయవాడ థర్మల్‌  విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ తరహాలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. విధి నిర్వహణలో  మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు షరతులు లేని కారుణ్య నియామకాలు చేపట్టాలని  కోరారు. కరోనా బీమా, అపరిమిత వైద్య సేవలను కల్పించాలన్నారు. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం ప్రజలకు, రైతులకు, సంస్థకు అదనపు భారం అవుతున్నందున దానిపై సమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం స్పందించక పోతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించా రు. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ  వైస్‌ చైర్మన్‌ ఎస్‌కే ఆల్తాఫ్‌, జిల్లా చైౖర్మన్‌ కే శ్రీనివాసులు, వైస్‌ చైర్మన్‌ ఎస్‌కే జాకీర్‌హుస్సేన్‌, కన్వీనర్‌ బీ భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-16T04:08:47+05:30 IST