జనసేన ఆధ్వర్యంలో రైతు దీక్ష

ABN , First Publish Date - 2020-12-08T03:11:31+05:30 IST

జనసేన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు.

జనసేన ఆధ్వర్యంలో రైతు దీక్ష
దీక్షలో జనసేన నాయకులు

వెంకటగిరి(టౌన్‌), డిసెంబరు 8: జనసేన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గంలో 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 35వేలు పరిహారం అందించాలన్నారు. అత్యవసరంగా రూ.10వేలు సాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్‌ రెడ్డి, రిజ్వానా భాషా, మునికృష్ణ, లక్కీ, అంకయ్య, వీరస్వామి, లక్ష్మీకాంత్‌, మధుసూదన్‌, జనసేనా యువత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T03:11:31+05:30 IST