కూలిన పెంకుటిల్లు.. ముగ్గురికి స్వల్పగాయాలు

ABN , First Publish Date - 2020-12-07T03:06:07+05:30 IST

వర్షాల కారణంగా పెంకుటిల్లు కూలిపోవడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

కూలిన పెంకుటిల్లు.. ముగ్గురికి స్వల్పగాయాలు
కూలిన పెంకుటిల్లు

వెంకటగిరి, డిసెండరు 6:  వర్షాల కారణంగా పెంకుటిల్లు కూలిపోవడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.  స్థానిక కలివేలమ్మ గుడి వీధిలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న  పెంకుటిల్లు ఆదివారం హఠాత్తుగా కూలిపోవడంతో రాధమ్మ, మునిలక్ష్మి స్వల్పంగా గాయపడ్డారు. ఆర్ముగం అనే వ్యక్తి శిథిలాల్లో  చిక్కుకు పోయాడు. మున్సిపల్‌ ఆర్‌ఐ మహేష్‌, సచివాలయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఆర్ముగంను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

Read more