రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి : ఏడీఏ

ABN , First Publish Date - 2020-11-14T02:58:41+05:30 IST

ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ధ్రోణితో కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కావలి సహాయ వ్యవసాయశాఖ అధికారి కన్నయ్య తెలిపారు.

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి : ఏడీఏ
వరి నారుమడులను పరిశీలిస్తున్న అధికారులు

కావలి, నవంబరు 13: ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ధ్రోణితో కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కావలి సహాయ వ్యవసాయశాఖ అధికారి కన్నయ్య తెలిపారు. మండలంలోని వరినారుమళ్లను శుక్రవారం ఆయన ఏవో శ్రీనివాసులు రెడ్డితో కలిసి పరిశీలించారు. వరి నారుమడుల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా కాలువలు వీయాలన్నారు. నీరు తీసివేసిన తర్వాత 5 సెంట్ల నారుమడికి 2-3 కిలోల యూరియా వేయాలని, నాలుగైదు రోజులు తర్వాత క్లోరోపైరిపాస్‌ మందు పిచికారి చేయాలన్నారు. మినుము, పెసర వేసిన రైతులు నీరు నిల్వ ఉండకుండా తీసివేసి పొటాషియం నైట్రేట్‌ లీటరు నీటికి 5 గ్రాములు కలుపుకుని పిచికారి చేసినట్లయితే ఆ పంటలను అధిక వర్షాల నుంచి సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2020-11-14T02:58:41+05:30 IST