-
-
Home » Andhra Pradesh » Nellore » rain
-
జల దిగ్బంధంలో ఏఎస్‌పేట
ABN , First Publish Date - 2020-11-28T05:21:43+05:30 IST
ఏఎస్‌పేట-నెల్లూరు మార్గంలోని నక్కలవాగు వంతన పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏఎస్‌పేట-ఆత్మకూరు మార్గంలో తెల్లపాడు సమీపంలో రోడ్డుపై నీరు ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని షాపబావి సెంటర్, బస్టాండ్ సెంట

ఏఎ్‌సపేట, నవంబరు 27: ఏఎస్‌పేట-నెల్లూరు మార్గంలోని నక్కలవాగు వంతన పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏఎస్‌పేట-ఆత్మకూరు మార్గంలో తెల్లపాడు సమీపంలో రోడ్డుపై నీరు ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని షాపబావి సెంటర్, బస్టాండ్ సెంటర్ ప్రాంతం, శ్రీకొలను గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి నీరు చేరింది. గండువారుపల్లి, పందిపాడు, హబ్బీపురం తదితర గ్రామాలలో సేకరించిన పాలు తీసుకెళ్లే మార్గం లేక లీటరు పాలను రూ.20లకే విక్రయించారు. దీంతో ప్రజలు ఎగబడి కొన్నారు. మండలంలో 950 హెక్టార్లు మినుము, 25 హెక్టార్లు పెసర, 22 హెక్టార్లు ఉలవలు, 9 హెక్టార్లు జొన్న పంటలు నష్టపోయినట్లు ఏవో రజని అంచనా వేశారు. ఏఎస్‌పేటతో పాటు కావలియడవల్లి గ్రామంలో మగ్గం గుంతలలో వర్షపు నీరు చేరింది.