మా నేతలకు రక్షణ కల్పించండి : బీజేపీ

ABN , First Publish Date - 2020-03-04T09:53:19+05:30 IST

బీజేపీ నేతలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల

మా నేతలకు రక్షణ కల్పించండి : బీజేపీ

నెల్లూరు(హరనాథపురం), మార్చి 3 : బీజేపీ నేతలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్‌, బీజేఎంఎం రాష్ట్ర కార్యదర్శి పోకూరు మాధవ్‌ మంగళవారం డీఆర్వో మల్లికార్జునకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ సీఏఏ అనుకూల వాదులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భజరంగ్‌దళ్‌ జిల్లా అధ్యక్షుడు శశికుమార్‌పై మూడు రోజుల క్రితం సీఏఏ వ్యతిరేక వాదులు దాడి చేశారని, ఆయన ఉగ్రవాది అని, ఉరితీయాలంటూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టింగ్‌లు పెట్టారని, అలాగే హిందూత్వ వాదులపై అసభ్య పదజాలంతో పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, వైసీపీ, టీడీపీ నేతలు ఓట్ల రాజకీయాల కోసం సీఏఏ, ఎన్‌పీఆర్‌ చట్టలను వ్యతిరేకిస్తూ అసత్య ప్రచారం చేయటం వల్ల నెల్లూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - 2020-03-04T09:53:19+05:30 IST