జడ్పీలో ఉద్యోగోన్నతులపై హర్షం

ABN , First Publish Date - 2020-12-28T05:09:07+05:30 IST

జిల్లా పరిషత్‌లో అన్ని విభాగాలకు సంబంధించి ఇప్పటి వరకు 102 మందికి ఉద్యోగోన్నతి లభించిందని, ఇందుకుగాను ప్రభుత్వానికి, కలెక్టర్‌కు, జడ్పీ సీఈవోకు ప్రత్యేక కృతజ్ఞతలు

జడ్పీలో ఉద్యోగోన్నతులపై హర్షం
కలెక్టర్‌ను సన్మానిస్తున్న అసోసియేషన్‌ నేతలు

నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 27 : జిల్లా పరిషత్‌లో అన్ని విభాగాలకు సంబంధించి ఇప్పటి వరకు 102 మందికి ఉద్యోగోన్నతి లభించిందని, ఇందుకుగాను ప్రభుత్వానికి, కలెక్టర్‌కు, జడ్పీ సీఈవోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కాకుల పెంచలయ్య తెలిపారు. ఆ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం జరిగింది. కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగులకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబు, సీఈవో సుశీలను సన్మానించారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ కార్యదర్శి రమేష్‌బాబు, నాయకులు అనిల్‌, శ్రీధర్‌, ప్రసన్న, వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:09:07+05:30 IST