నెల్లూరు వాసి లేఖకు రాష్ట్రపతి స్పందన

ABN , First Publish Date - 2020-03-12T09:42:26+05:30 IST

నగరంలోని శెట్టిగుంట రోడ్డు వీవర్స్‌ కాలనీలో ఉంటున్న విశ్రాంత ఉద్యోగి, (ఏవో పోలీసు శాఖ) సీ ప్రసాద్‌ రాసిన ఓ లేఖకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆయన

నెల్లూరు వాసి లేఖకు రాష్ట్రపతి స్పందన

నెల్లూరు (సాంస్కృతికం), మార్చి 11 : నగరంలోని శెట్టిగుంట రోడ్డు వీవర్స్‌ కాలనీలో ఉంటున్న విశ్రాంత ఉద్యోగి, (ఏవో పోలీసు శాఖ) సీ ప్రసాద్‌ రాసిన ఓ లేఖకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆయన లేఖపై ఏమి చర్యలు తీసుకున్నారో ఆయనకే నేరుగా తెలపాలని భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.


విశ్రాంత ఉద్యోగి సీ ప్రసాద్‌ జనవరి నెల 19వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్‌పీఆర్‌, సీఏఏ చట్టాలకు వ్యతిరేక ఉద్యమం గురించి తన లేఖలో ప్రస్తావించాడు. ఈ చట్టాలు ముస్లింలకు అభద్రతా భావాన్ని కల్పించాయని, వాటిని రద్దు చేయడమో లేదా ముస్లింలతో పాటు అందరికి ఆమోదయోగ్యంగా సవరించాలని కోరుతూ ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు.. ఈ లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఫిబ్రవరి 7వ తేదీ హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసి దాని నకలు సీ ప్రసాద్‌కు పంపింది. 

Updated Date - 2020-03-12T09:42:26+05:30 IST