తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి

ABN , First Publish Date - 2020-12-30T05:20:11+05:30 IST

తెలుగు భాషాభివృద్ధికి, తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌, తెలుగుభాష, సంస్కృతి అభివృద్ధి సంఘం చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ తెలిపారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి
మాట్లాడుతున్న షరీఫ్‌

మాతృభాషకు ప్రాధాన్యం అవసరం

రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌


నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 29

తెలుగు భాషాభివృద్ధికి, తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌, తెలుగుభాష, సంస్కృతి అభివృద్ధి సంఘం చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ తెలిపారు. నెల్లూరు హరనాథపురంలోని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలు వారి భాషకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయని, వారితో పోల్చుకుంటే తెలుగు భాషకు మనం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర భాషల వారికి వారి మాతృభాష నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అయితే పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి మాత్రం అంతగా అవకాశాలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరుకు తరలివచ్చిందని, భాషాభివృద్ధికి ఆ కేంద్రం ఎంత వరకు ఉపయోగపడుతుందనేది అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:20:11+05:30 IST