-
-
Home » Andhra Pradesh » Nellore » prabhutva bhoomilo pravesite caryalu
-
ప్రభుత్వ భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2020-12-16T02:33:42+05:30 IST
: ప్రభుత్వ భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని గూడూరు సబ్‌కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అన్నారు.మం

బాలాయపల్లి,డిసెంబరు15: ప్రభుత్వ భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని గూడూరు సబ్‌కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అన్నారు.మండలంలోని అలిమిలి పంచాయతీలో గల సర్వేనంబరు 4లో సుమారు 30 ఎకరాల మేత పోరంబోకు భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు ఎస్సీలు ఆక్రమించి సాగుచేసుకునేందుకు ప్రయత్నించారు. రెవెన్యూ అదికారులు అడ్డుతగలడంతో ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.దీంతో హైకోర్టు స్టేటస్‌కో ఆర్డర్ జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం సబ్‌కలెక్టర్ వివాదాస్పద భూమిని పరిశీలించి విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సదరు భూమిలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.అనంతరం స్థానిక సచివాలయాన్ని తనిఖీ చేసి ఇంజనీంగ్ అసిస్టెంట్‌కు పలు ప్రశ్నలు వేశారు. ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన వెంట తహసీల్దార్ ఆదిశేషయ్య, తదితరులు పాల్గోన్నారు.