-
-
Home » Andhra Pradesh » Nellore » power saving awarness program at nellore
-
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2020-12-16T05:03:03+05:30 IST
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ రమణదేవి పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని విద్యుత్ భవన్‌లో మంగళవారం నిర్వహించారు.

ఇన్‌చార్జి ఎస్‌ఈ రమణదేవి
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 15 : విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ రమణదేవి పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని విద్యుత్ భవన్‌లో మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యుత్ పొదుపుపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. పొదుపుతోనే సహజవనరులను ఎక్కువ కాలం వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎల్‌ఈడీ బల్బుల వాడకంతో 60శాతం విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర డీఈ శ్రీహరిరావు, సీనియర్ ఏవో డీ సురేంద్ర, ఈఈ అనిల్‌కుమార్, అల్తాఫ్, మధుసూదన్‌రెడ్డి, దొరస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.