పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం

ABN , First Publish Date - 2020-12-16T04:37:47+05:30 IST

తన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములుకు పలువురు ఘన నివాళి అర్పించారు

పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం
సూళ్లూరుపేట పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తదితరులు

నాయుడుపేట, డిసెంబరు 15 : తన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములుకు పలువురు ఘన నివాళి అర్పించారు. మంగళవారం ఆయన వర్ధంతి సందర్భంగా  స్థానిక బస్టాండ్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి సీడీసీ మాజీ చైర్మన్‌ కట్టా సుధాకర్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కట్టా రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రాధాకిశోర్‌, మొదలియార్‌ సంఘం డైరెక్టర్‌ చెంచయ్య, రాష్ట్ర యువజన కార్యదర్శి పాలూరు దశరాధరామిరెడ్డి, సిద్ధయ్య, నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కలికి మోహన్‌, రాహుల్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో..

నాయుడుపేట ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సరోజని, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు శ్రీనివాసులు, మండల పరిషత్‌ కార్యాలయాలలో ఎంపీడీవో చంద్రశేఖర్‌లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. 

నాయుడుపేట టౌన్‌ : నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నుడా మాజీ డైరెక్టర్‌ గూడూరు రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, వాణిజ్య రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ శ్రీరామ్‌ ప్రసాద్‌,  తెలుగుయువత జిల్లా కార్యదర్శి అవధానం సుధీర్‌, మాజీ కౌన్సిలర్లు నాగభూషణం, పసల గంగాప్రసాద్‌,  బాబు,  సులేమాన్‌, నూర్జహాన్‌, రామకృష్ణ  ఉన్నారు.

సూళ్లూరుపేట : స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానిక కచ్చేరివీధిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, కళత్తూరు శేఖర్‌రెడ్డి, దబ్బల శ్రీమంత్‌రెడ్డి, అయితా శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. వాసవీక్లబ్‌ నిర్వాహకులు పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌ సుబ్రహ్మణ్యం, ఎం. రమేష్‌, పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. 

తడ  : స్థానిక తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు శాంతకుమారి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివయ్యలు పొట్టి శ్రీరాములు చిత్రపట్టాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, శేషారావు, తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.Updated Date - 2020-12-16T04:37:47+05:30 IST