అమరజీవికి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-16T04:37:39+05:30 IST

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సత్రం సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నేతలు పూల

అమరజీవికి ఘన నివాళి
నివాళులర్పిస్తున్న ఆరవైశ్య సంఘం ప్రతినిధులు

ఆత్మకూరు, డిసెంబరు 15: పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సత్రం సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నేతలు పూలమాలలు వేని నివాళులర్పించారు.  మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ దోర్నాదుల సురేష్‌బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమిశెట్టి మాలకొండయ్య గుప్తా, పొన్నూరు హజరత్తయ్య, మెంటా హజరత్‌బాబు, దోర్నాదుల లక్ష్మణ, మెంటా మహేష్‌, తోట సుబ్రహ్మణ్యం పలువురు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. బట్టేపాడు సచివాలయంలో వైసీపీ నాయకులు వాసిపల్లి లక్ష్మీరెడ్డి, బాబుల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి హజరత్‌బాబు, సచివాలయ సిబ్బంది నివాళులర్పించారు.

Updated Date - 2020-12-16T04:37:39+05:30 IST