సాగరం చెరువుకు గండి

ABN , First Publish Date - 2020-11-28T05:19:00+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో జనజీవనం స్తంభించింది. పల్లవోలు, కేతామన్నేరు, కొమ్మలేరు

సాగరం చెరువుకు గండి
కొమ్మలేరు వాగు దాటేందుకు అవస్థలు పడుతున్న యువకులు

అనంతసాగరం, నవంబరు 27: తుఫాన్‌ ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో జనజీవనం స్తంభించింది. పల్లవోలు, కేతామన్నేరు, కొమ్మలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగుల నుంచి వర్షపు నీరు అనంతసాగరం చెరువుకు చేరడంతో అలుగు ప్రాంతంలో కట్ట తెగిపోయింది. చాపురాళ్లపల్లి వద్ద చెరువు అలుగు పారడంతో జాతీయరహదారి 565 కోతకు గురైంది. వర్షపునీరు పొలాలోకి చేరడంతో చెరువులను తలిపిస్తున్నాయి.అత్యకూరు-సోమశిలతో పాటు అనంతసాగరంతో అన్ని గ్రామాలకు రాకపోకలు కట్‌ అయ్యాయి. కరెంటు తీగలు తెగిపోవడంతో రెండురోజులుగా అంధకారం నెలకొంది. పెన్నాతీర గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

Updated Date - 2020-11-28T05:19:00+05:30 IST