సారా తయారీ కేంద్రాలపై దాడులు

ABN , First Publish Date - 2020-12-31T03:17:52+05:30 IST

బోగోలు మండలం కప్పరాళ్లతిప్పలో నివాస గృహాల్లో ఏర్పాటు చేసిన సారా తయారీ కేంద్రాలపై నెల్లూరు ఏఎస్పీ ఏసీ శ్రీనివాసరావు, ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు బుధవారం కావలి ఎస్‌ఈబీ సీఐ అరుణకుమారి ఆధ్వర్యంలో ఎస్‌ఈబీ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు.

సారా తయారీ కేంద్రాలపై దాడులు
సారాతోపాటు నిందితులతో ఎస్‌ఈబీ, పోలీసులు

ఇదరి అరెస్టు

బిట్రగుంట, డిసెంబరు 30: బోగోలు మండలం కప్పరాళ్లతిప్పలో నివాస గృహాల్లో ఏర్పాటు చేసిన సారా తయారీ కేంద్రాలపై నెల్లూరు ఏఎస్పీ ఏసీ శ్రీనివాసరావు, ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు బుధవారం కావలి ఎస్‌ఈబీ సీఐ అరుణకుమారి ఆధ్వర్యంలో ఎస్‌ఈబీ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో యశోదమ్మ, ఎలీజా ఇళ్లల్లో ఒక్కొక్కరి వద్ద పది లీటర్ల వంతున విక్రయానికి సిద్ధంగా ఉంచిన 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. అలాగే సుధాకర్‌ అనే వ్యక్తి ఇంట్లో దాడులు చేసి 5 లీటర్ల సారా, 50 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని, 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కవిత, మికాయేల్‌ ఇళ్లల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 400 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అయితే సుధాకర్‌, కవిత, మికాయేల్‌ పరారయ్యారు. ఈ దాడుల్లో కోవూరు సీఐ వెంకటేశ్వరావు, ఎస్‌ఐలు కృష్ణారావు, శివప్రసాద్‌,  బోగోలు ఎస్‌ఐ సుమన్‌, పోలీసు సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T03:17:52+05:30 IST