పోలీసు విధుల్లో నేర విచారణ కీలకం : ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-02T04:23:34+05:30 IST

పోలీసుల విధుల్లో నేర విచారణ అనేది కీలకమైనదని ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ పేర్కొన్నారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర సమవేశ మందిరంలో మంగళవారం పోలీస్‌ డ్యూటీ మీట్‌ -2020ను ఆయన ప్రారంభించారు.

పోలీసు విధుల్లో నేర విచారణ కీలకం : ఎస్పీ
పోలీస్‌ డాగ్‌ నుంచి వందనం స్వీకరిస్తున్న ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌

నెల్లూరు(క్రైం), డిసెంబరు 1:  పోలీసుల విధుల్లో నేర విచారణ అనేది కీలకమైనదని ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ పేర్కొన్నారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర సమవేశ మందిరంలో మంగళవారం పోలీస్‌ డ్యూటీ మీట్‌ -2020ను ఆయన ప్రారంభించారు. ఈ మీట్‌ రెండు రోజులు జరుగుతుందన్నారు. వృత్తి నైపుణ్యం పెంచుకోవడం, విచారణలో మెలకువలు, సాంకేతికతను వినియోగించుకోవడం తదితర కొత్త విషయాలను తెలియజేస్తారన్నారు. జిల్లా మీట్‌లో ప్రతిభ కనబరిచిన వారిని స్టేట్‌ మీట్‌కు, స్టేట్‌లో ప్రతిభ కనపరిచిన వారిని నేషనల్‌ మీట్‌కు పంపుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు పీ వెంకటరత్నం, ఎస్‌ వీరభద్రుడు, డీఎస్పీలు పీ నాగరాజు, గాంధీ, పీఆర్వో శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:23:34+05:30 IST