బీజేవైఎం నాయకుడిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-26T03:50:57+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేవైఎం నాయకుడిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అర్జు బాలకృష్ణ బుధవారం నగరంలోని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీజేవైఎం నాయకుడిపై చర్యలు తీసుకోవాలి

నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), నవంబరు 25 : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేవైఎం నాయకుడిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అర్జు బాలకృష్ణ బుధవారం నగరంలోని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై బీజేవైఎం జిల్లా నాయుకుడు పెల్లూరు సుమన్‌ సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అవమానించే విధంగా భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్‌పై ధ్వేషభావం పెంచుకుని అనుచిత వాఖ్యలు చేశారన్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more