-
-
Home » Andhra Pradesh » Nellore » Pensions and cloths Distribution at nellore
-
156 మందికి పింఛన్లు, చీరలు
ABN , First Publish Date - 2020-12-11T05:17:56+05:30 IST
అధికారం, పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.

నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 10 : అధికారం, పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్‌కుమార్ గురువారం 156 మందికి పింఛన్లు, చీరలు పంచిపెట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజీజ్ మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు 156 మందికి ప్రతి నెలా రూ.200 పింఛన్ ఇవ్వడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలదంకి సుధాకర్, సాబీర్‌ఖాన్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.