కల్యాణం..కమనీయం

ABN , First Publish Date - 2020-12-20T03:47:54+05:30 IST

పెంచలకోనలో దేవేరులతో శ్రీవారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శనివారం ఘనంగా నిర్వహించారు.

కల్యాణం..కమనీయం
కోనలో శ్రీవారి కల్యాణం


రాపూరు, డిసెంబరు 19: పెంచలకోనలో దేవేరులతో శ్రీవారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శనివారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాలతోపాటు అన్నప్రసాద పొట్లాలు అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. శ్రీవార్లను  రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ యానాదయ్య దర్శించుకునిపూజలు చేశారు. ఆలయంలోని వాయిద్యకళాకారులు కల్యాణకట్టలోని క్షురకుల సమస్యల సాధనకు తన వంతు కృషిచేస్తామన్నారు. ఆయన వెంట స్థానికులు పెంచలయ్యస్వామి, పెంచలయ్య ఉన్నారు

Read more