పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సురేష్‌బాబు

ABN , First Publish Date - 2020-12-14T04:41:37+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లాకు చెందిన లేళ్లపల్లి సురేష్‌బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆదివారం నియామకపు ఉత్తర్వులు అందచేశారు.

పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సురేష్‌బాబు
లేళ్లపల్లి సురేష్‌బాబు

నెల్లూరు(వైద్యం), డిసెంబరు 13 : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లాకు చెందిన లేళ్లపల్లి సురేష్‌బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆదివారం నియామకపు ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సురేష్‌బాబు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారన్నారు. పార్టీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడిగా 15 ఏళ్లు బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. పార్టీ అధిష్ఠానం సురేష్‌బాబు సేవలను గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిందన్నారు.  

Updated Date - 2020-12-14T04:41:37+05:30 IST