అభిమానమే నడిపిస్తోంది!

ABN , First Publish Date - 2020-12-06T03:38:07+05:30 IST

అభిమానులే అండగా ముందుండి నడిపిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు జిల్లాలోని అభిమానులను కొనియాడారు.

అభిమానమే నడిపిస్తోంది!
వెంకటగిరిలో ప్రసంగిస్తున్న పవన్‌ కల్యాణ్‌

 గూడూరు, వెంకటగిరిలో పవన్‌ రోడ్‌షో

భారీగా తరలివచ్చిన అభిమానులు

గూడూరు/వెంకటగిరి టౌన్‌, డిసెంబరు 5: అభిమానులే అండగా ముందుండి నడిపిస్తున్నారని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు జిల్లాలోని అభిమానులను కొనియాడారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులు, చేనేత కార్మికులను పరామర్శించడంలో భాగంగా శనివారం ఆయన గూడూరు, వెంకటగిరి పట్టణాల్లో పర్యటించారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద  జాతీయరహదారిపై ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్‌ కేంద్రం వరకూ ర్యాలీగా తరలి వెళ్లారు.  తిప్పవరప్పాడు జనసేన పతాకావిష్కరణ చేశారు.  వెంకటగిరిలో అభిమానులు పూల వర్షంతో స్వాగతం పలికారు.   వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ప్రసంగిస్తున్నంత సేపూ అభిమానులు చిన్నాపెద్ద తేడా లేకుండా గొడుగులు వేసుకుని ఆసాంతం విన్నారు. అనంతరం ఆయన తిరుపతికి వెళ్లిపోయారు.  జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్‌, అల్లం బాబు, నయూం, విజయ్‌, గోవర్థన్‌, కరీముల్లా, కొట్టే వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బైరప్ప, గాలి ప్రకాష్‌నాయుడు, పాలవల్లి మౌనీష్‌, తూపిలి దినకర్‌, చిన్నా, కోటి తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2020-12-06T03:38:07+05:30 IST