-
-
Home » Andhra Pradesh » Nellore » pasu teeka
-
పశువుల్లో గురక వ్యాధి నివారణకు టీకాలు
ABN , First Publish Date - 2020-12-16T04:30:33+05:30 IST
వాశిలిలో గురకవ్యాధి(గుదిపెట్టు వ్యాధి) వ్యాధి సోకడంతో రెండు పశువులు మృతిచెందాయి. దాంతో మంగళవారం 524 పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజి పరిశోధన బృందం మున్సిపల్ పరిధి

ఆత్మకూరు, డిసెంబరు 15: వాశిలిలో గురకవ్యాధి(గుదిపెట్టు వ్యాధి) వ్యాధి సోకడంతో రెండు పశువులు మృతిచెందాయి. దాంతో మంగళవారం 524 పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజి పరిశోధన బృందం మున్సిపల్ పరిధిలో పర్యటించి పశువుల రక్త నమూనాలు, స్వాబ్ సేకరించారు. పశువులకు సోకే వ్యాధులపై అవగాహన కల్పించారు. పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఎస్.జయచంద్ర, పశువైద్యాధికారి ఆర్.వీరహరిణ్ పాల్గొన్నారు.