శిథిలగదిని పరిశీలించిన డీవీఈవో
ABN , First Publish Date - 2020-12-08T01:53:59+05:30 IST
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల కురిసిన వర్షానికి శిథిల తరగతి గది కూలింది.ఈ విషయం ఈనెల 5వ తేదీన ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దీంతో జేసీ ఆదేశాల మేరకు జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటశేష

ఫ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
పొదలకూరు, డిసెంబరు 7 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల కురిసిన వర్షానికి శిథిల తరగతి గది కూలింది.ఈ విషయం ఈనెల 5వ తేదీన ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దీంతో జేసీ ఆదేశాల మేరకు జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటశేషయ్య సోమవారం కళాశాలను పరిశీలించి సమగ్ర నివేదికను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నాడు - నేడుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కళాశాలలో అంతర్గత రోడ్లు, ఇతర గదుల నిర్మాణంకు కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులురెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
-----------