-
-
Home » Andhra Pradesh » Nellore » parisaraala parisubrata anari bhadyata
-
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత : కాకాణి
ABN , First Publish Date - 2020-12-16T02:52:45+05:30 IST
పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొ

ముత్తుకూరు, డిసెంబరు15: పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రహ్మదేవంలో మంగళవారం పర్యటించి, పలు అభివృద్థి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఇంటితో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలమన్నారు. శిశుపోషణ దినోత్సవం సందర్భంగా గర్భిణులకు, బాలింతలకు పోషక పదార్థాలను పంపిణీ చేశారు. అనంతరం ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుశీల, డీపీవో ధనలక్ష్మి, వైసీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు ఈదూరు రామమోహన్‌రెడ్డి, మునుకూరు రవికుమార్‌రెడ్డి, కాకుటూరు లక్ష్మణరెడ్డి, నెల్లూరు శివప్రసాద్, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, నడవడి ముత్యంగౌడ్, అగ్ని మస్తాన్, బషీర్, ఎంపీడీవో ప్రత్యూష, తహసీల్దారు సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.