-
-
Home » Andhra Pradesh » Nellore » pamaoil kalusymto gorrela murti
-
పామాయిల్ కాలుష్యంతో గొర్రెలు మృతి
ABN , First Publish Date - 2020-12-16T02:23:13+05:30 IST
పంటపాళెం సమీపంలో పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గొర్రెలు

ముత్తుకూరు, డిసెంబరు15: పంటపాళెం సమీపంలో పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గొర్రెలు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పామాయిల్ పరిశ్రమల వారు వ్యర్థపునీటిని కాలువల్లో కలుపుతున్నారన్నారు. ఈ నీటిని తాగి మంగళవారం నాలుగు గొర్రెలు మృతి చెందాయన్నారు. ఈ కలుషిత నీటి కారణంగా పశువులు అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. అధికారులు స్పందించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు తుంగా ఏడుకొండలు, నందయ్య, రాఘవయ్య, శేషయ్య, వెంకటరమణయ్య పాల్గొన్నారు.