-
-
Home » Andhra Pradesh » Nellore » paadi rythulaku subhavartha
-
ఒకేసారి రూ.7 పెంపు!
ABN , First Publish Date - 2020-12-31T05:09:33+05:30 IST
విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు నూతన సంవత్సరంతోపాటు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసిందని ఆ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

‘విజయ’ పాడి రైతులకు శుభవార్త
పాల సేకరణ ధరలు భారీగా పెరుగుదల
రేపటి నుంచి అమలు.. డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి
నెల్లూరు(వెంకటేశ్వరపురం), డిసెంబరు 30 : విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు నూతన సంవత్సరంతోపాటు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసిందని ఆ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహకార డెయిరీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పాల సేకరణ ధరను ఒకేసారి లీటరుకు రూ.7 చొప్పున జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు 10శాతం వెన్న ఉన్న గేదె పాలకు లీటరుకు రూ.56.40 చెల్లించే వారిమని, ఇకనుంచి రూ.63.40 చెల్లిస్తామన్నారు. 5శాతం వెన్న ఉన్న పాలకు లీటరుకు రూ.3.50, 6శాతం ఉన్న పాలకు రూ.4.50 చొప్పున సేకరణ ధర పెంచామన్నారు. ఇదేవిధంగా ఆవు పాల ధరను సైతం పెంచారు. డెయిరీ అభివృద్ధికి అందరిక సహకారం అవసరమని కోరారు. పాడి రైతులు, వినియోగదారులు, ఏజెంట్లు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.