సర్వేపల్లిలో మీరు ఏం సాధించారో చెప్పి ఓట్లు అడగండి

ABN , First Publish Date - 2020-12-18T02:44:22+05:30 IST

ప్రజా సంక్షేమం కోసం తాము చేపట్టిన పథకాలన్నింటినీ నిలిపివేసి శిలాఫలకాలు మాత్రం వారి పేర్లతో వేసు

సర్వేపల్లిలో మీరు ఏం సాధించారో చెప్పి ఓట్లు అడగండి
మాట్లాడుతున్న సోమిరెడ్డి

ఫ సోమిరెడ్డి 

పొదలకూరు, డిసెంబరు 17 : ప్రజా సంక్షేమం కోసం తాము చేపట్టిన పథకాలన్నింటినీ నిలిపివేసి శిలాఫలకాలు మాత్రం వారి పేర్లతో వేసుకుంటున్న వైసీపీ నాయకులు, సర్వేపల్లిలో ఏం సాధించారో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ యువ నాయకుడు దేవినేని శరత్‌బాబు తండ్రి కృష్ణమనాయుడు(మాజీ ఏఎంసీ డైరెక్టర్‌) ఇటీవల ఆనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండలంలో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్‌ను, రూ.4.70కోట్లతో 10పైసలు లీటరు మినరల్‌ వాటర్‌ అందించే స్కీమును నిలిపివేశారన్నారు. మెట్టప్రాంతమైన పొదలకూరు మండలాన్ని కండలేరు, సోమశిల జలాలతో సస్యశామలం చేశామన్నారు.  ఎన్నో ఏళ్లుగా అనుమతులకు నోచుకోని భూములకు అటవీ అనుమతులు ఇప్పించామన్నారు. వైసీపీ పాలనలో తమ పథకాలకు, తాము చేయించిన పనులకు నిధులు నిలుపుదల చేసి పెద్ద అక్షరాలతో శిలాఫలకాలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  నాబార్డు, కేంద్ర నిధులతో వేసే రోడ్లకు తామేమో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్టుచేటన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్‌బాబు, టీడీపీ సనియర్‌ నాయకులు పుల్లయ్యగౌడ్‌, పులిపాటి వెంకటరత్నం నాయుడు,  ఏనుగు రామ్మోహన్‌రెడ్డి, జమీర్‌బాషా,  సుగుణమ్మ, గంధం రమేష్‌, రామకృష్ణ, సందీప్‌, రాజా, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T02:44:22+05:30 IST