ప్రజాభిప్రాయం మేరకే పరిశ్రమల స్థాపన

ABN , First Publish Date - 2020-11-28T05:09:29+05:30 IST

ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం పరిశ్రమలు స్థాపిస్తుందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.

ప్రజాభిప్రాయం మేరకే పరిశ్రమల స్థాపన
సదస్సులో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

జేసీ ప్రభాకర్‌రెడ్డి

పెళ్లకూరు, నవంబరు 27 : ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం పరిశ్రమలు స్థాపిస్తుందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. మండలంలోని శిరసనంబేడు గ్రామంలో ఉన్న అమ్మన్‌ ట్రై స్పాంజ్‌ అండ్‌ పవర్‌ పరిశ్రమలో అదనంగా టీఎంటీబార్‌,  ఎంఎస్‌బిల్లెట్స్‌, స్పాంజ్‌, పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే క్రమంలో శుక్రవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఆ పరిశ్రమ ఆవరణలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జేసీ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు వేలూరు మురళీకృష్ణారెడ్డి, వైసీపీ నేత శిరసనంబేటి చైతన్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గ్రామంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి నిధులిచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం శిరసనంబేడు రాజుపాళెం గ్రామవాసి గుంటమడుగు శ్రీనివాసరాజు మాట్లాడుతూ పరిశ్రమ నుంచి  కాలుష్యం బయటకు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆ పరిశ్రమ ఎండీ సోమసు ందరం సమాధానం ఇస్తూ ఇప్పటికే 200 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, అదనంగా ఏర్పాటు కానున్న ప్లాంట్‌ ద్వారా మరో 500 మందికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాలుష్యం బయటకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.  కార్యక్రమంలో నాయుడుపేట ఆర్డీవో సరోజిని, పర్యావరణశాఖ ప్రతినిధి ప్రమోద్‌కుమార్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్లు బోస్‌, శ్రీనివాసన్‌, కంపెనీ ప్రతినిధి రాజేష్‌, తహసీల్దారు కె. రాజ్‌కుమార్‌, ఎంపీడీవో ప్రమీలారాణి, నాయకులు జీ, వెంకటకృష్ణారెడ్డి, ఎస్‌. శ్యామ్‌రెడ్డి, జీ. గోపాల్‌ పాల్గొన్నారు.


Read more