వలంటీర్ల పోస్టులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-04-28T10:12:58+05:30 IST

కావలిపురపాలక సంఘంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ల పోస్టులకు సోమవారం ఆన్‌లైన్‌ద్వారా మున్సిపల్‌ కమిషనర్‌

వలంటీర్ల పోస్టులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు

కావలి, ఏప్రిల్‌ 27: కావలిపురపాలక సంఘంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ల పోస్టులకు సోమవారం ఆన్‌లైన్‌ద్వారా మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కే వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలుత ముఖాముఖీగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు మున్సిపల్‌ అధికారులు ఆహ్వానాలు పంపారు. అయితే కరోనా ఉన్నప్పటికి అభ్యర్థులు భౌతిక దూరం లేకుండా మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో గుంపులుగా వచ్చి నిలబడటంతో దానిని మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. వెంటనే ఇక్కడ పరిస్థితులను నెల్లూరు నగర కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు తాము ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలపటంతో కావలిలో కూడా ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలతో ముందుకు సాగారు. 

Updated Date - 2020-04-28T10:12:58+05:30 IST