విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-31T04:00:22+05:30 IST

విద్యుదాఘాతానికి గురైన తన కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తండ్రి రమణయ్య స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి
సురేష్‌ (ఫైల్‌)

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 30 :  విద్యుదాఘాతానికి గురైన తన కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తండ్రి రమణయ్య స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మండలంలోని భీమవరంలో వీధిలైట్లు వెలగకపోవడంతో మంగళవారం సాయంత్రం ఆనాల సురేష్‌ (35) విద్యుత్‌ స్తంభం ఎక్కి మరమ్మత్తులు చేస్తూ,  పక్కనే వెళ్తున్న 6.3 కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని   నాయుడుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడుకు భార్య సుబ్బలక్ష్మి, కుమారులు పృథ్వీ, మహేష్‌లు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-31T04:00:22+05:30 IST