-
-
Home » Andhra Pradesh » Nellore » One died in road accident
-
కారు ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-31T04:02:46+05:30 IST
కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు.

సూళ్లూరుపేట, డిసెంబరు 30: కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. వట్రపాళెంకు చెందిన వెట్టి మహేష్‌బాబు (21) శ్రీసిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై డ్యూటీకి వెళుతుండగా, హోలీక్రాస్ సమీపంలో ఓ కారు వెనుక నుంచి ఢీకొని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పేట పోలీసులు కేస దర్యాప్తు చేస్తున్నారు.