సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు

ABN , First Publish Date - 2020-09-16T10:04:48+05:30 IST

ప్రతి రైతు మోటారుకు మీటరు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ అధికారులు సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ వి

సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు

 ప్రతి రైతు మోటారుకు మీటరు బిగించాలిదొరవారిసత్రం, సెప్టెబంరు 15 : ప్రతి రైతు మోటారుకు మీటరు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ అధికారులు సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో తీసుకు వస్తున్న నగదు బదిలీ పథకంపై మంగళవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయ ఆవరణలో ఈఈ కృష్ణ ప్రసాద్‌,  ఏడీఏ ఖాదర్‌బాషాలు విద్యుత్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు. రైతుల పేరిట బ్యాంక్‌ ఖాతాలు ఏర్పాటు చేయాలని, అనధికారికంగా విద్యుత్‌ వాడుకుంటున్న రైతులను గుర్తించి మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ మురళి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-16T10:04:48+05:30 IST