నెల్లూరు బ్యారేజీకి రూ.113 కోట్లు

ABN , First Publish Date - 2020-11-07T08:28:45+05:30 IST

నెల్లూరు బ్యారేజీ నిర్మాణంలో మిగిలిన పనులను రూ.113 కోట్లతో చేపట్టేందుకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నెల్లూరు బ్యారేజీకి రూ.113 కోట్లు

 పనుల పూర్తికి నిధులు విడుదల


నెల్లూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు బ్యారేజీ నిర్మాణంలో మిగిలిన పనులను రూ.113 కోట్లతో చేపట్టేందుకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టెండర్లు పూర్తవగా ఇప్పుడు పూర్తిస్థాయి అనుమతులు రావడంతో ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. 2008లో నెల్లూరు బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాగా ఇంకా సుమారు ఇరవై శాతం పనులు జరగాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్‌ పనులు నెమ్మదిగా చేస్తున్నారని, మ్యూచువల్‌ ఒప్పందంతో కాంట్రాక్టర్‌ను తొలగించింది. మిగిలిన పనులకు తాజా అంచనాలతో రూ.113 కోట్లు అవసరమని ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. మే నెలలో మిగిలిన పనులకు టెండర్లు కూడా పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించి జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జలవనరుల శాఖ జీవో విడుదల చేసింది. 


ఇరిగేషన్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా కృష్ణారావు

ఇరిగేషన్‌ సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా సోమశిల ఎస్‌ఈ కృష్ణారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా నీరు-ప్రగతి ఎస్‌ఈ వరలక్ష్మి వ్యవహరిస్తున్నారు. నాలుగు నెలల క్రితం బీవీఎస్‌ ప్రసాదరావు ఎస్‌ఈగా పదవీ విరమణ చేయగా అప్పటి నుంచి రెగ్యులర్‌ ఎస్‌ఈను ప్రభుత్వం నియమించలేదు. 

Updated Date - 2020-11-07T08:28:45+05:30 IST