గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి
ABN , First Publish Date - 2020-11-03T09:50:52+05:30 IST
వ్యాధుల నివారణకు గ్రామ ప్రజలు పరిశుభ్రతను పాటించాలని ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. రామతీర్థం రామలింగాపురంలో సోమవారం జరిగిన మనం- మన పరిశుభ్రత కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
విడవలూరు, నవంబరు 2: వ్యాధుల నివారణకు గ్రామ ప్రజలు పరిశుభ్రతను పాటించాలని ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. రామతీర్థం రామలింగాపురంలో సోమవారం జరిగిన మనం- మన పరిశుభ్రత కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నేత ఆవుల వాసు 300 డస్ట్ బిన్‌లను ఎంపీడీవో చేతుల మీదుగా పంచాయతీకి అప్పగించారు. ఆనంతరం చిరంజీవి మాట్లడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సాయిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రాధాకుమారి, వైసీపీ నేతలు బుచ్చింగారి తిరుపతి పాల్గొన్నారు.