రావాల్సిన దాణా బకాయిలు రూ.35 కోట్లు

ABN , First Publish Date - 2020-11-03T09:48:44+05:30 IST

పాడిరైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త పథకాలు లేవని, దాణా కింద ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 35కోట్లు బకాయిలు రావాల్సి ఉందని పశుసంవర్ధకశాఖ జేడీ విజయ్‌మోహన్‌ తెలిపారు.

రావాల్సిన దాణా బకాయిలు రూ.35 కోట్లు

 ఆరునెలలుగా నిలిచిపోయిన పశునష్టపరిహారం 

 సంత పర్యవేక్షణలో జేడీ విజయ్‌మోహన్‌ 



 మనుబోలు, నవంబరు 2: పాడిరైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త పథకాలు లేవని, దాణా కింద ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 35కోట్లు బకాయిలు రావాల్సి ఉందని పశుసంవర్ధకశాఖ జేడీ విజయ్‌మోహన్‌ తెలిపారు. స్థానిక బీసీ కాలనీలో ఉన్న పశువుల సంతను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వచ్చిన 116ఎద్దుల్లో 13 ఎద్దులకు వైద్యపరీక్షలు చేశామన్నారు. ఎద్దులను అక్రమంగా తీసుకుని వచ్చి ఇతర రాష్ట్రాలకు తరలించడం నేరమన్నారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ఇక్కడున్న ఎద్దులను గోశాలకు తరలిస్తారా.. కేసులు నమోదు చేసి కోర్టుకు పంపి తరువాత వేలంపాట వేస్తారా ? అన్నది అధికారుల ఆదేశానుసారం చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో పశునష్టపరిహారం కింద రూ. 1.9కోట్లు చెల్లించామన్నారు. ఆరునెలలుగా ఈ పధకం కింద రైతులకు నష్టపరిహారం అందడం లేదన్నారు. ఇప్పటికీ 2వేల పశువులకు నష్టపరిహారం కావాలని దరఖాస్తులు వచ్చాయన్నారు. దాణా బకాయిలు రూ.50కోట్లు ఉండగా ఇటీవలే రూ.15కోట్లు విడుదల చేశారన్నారు.  కార్యక్రమంలో ఏడీ గురవారెడ్డి, వైద్యులు హర్షకుమార్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T09:48:44+05:30 IST