‘చుక్కల’ సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-11-03T09:38:10+05:30 IST

కావలి పట్టణంలోని నివాస ప్రాంతాల్లో సగభాగానికి పైగా చుక్కల భూములు ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్‌లు నిలిపి వేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులను పడుతున్నారని

‘చుక్కల’ సమస్యలు పరిష్కరించండి

 ఆర్డీవో శ్రీనివాసులుకు టీడీపీ నేతల వినతి


కావలి, నవంబరు 2: కావలి పట్టణంలోని నివాస ప్రాంతాల్లో సగభాగానికి పైగా చుక్కల భూములు ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్‌లు నిలిపి వేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులను పడుతున్నారని, తక్షణం ఆ సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో శ్రీనివాసులును టీడీపీ నాయకులు కోరారు. కావలి ఆర్డీవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను సోమవారం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జనతాపేటలో ఉదయగిరి రోడ్డుకు ఇరువైపులా ఇటీవల తొలగించిన ఆక్రమణలలో జీవనం కోల్పోయిన వారికి మున్సిపల్‌ అధికారులు ప్రత్యమ్నాయం కల్పించలేదన్పారు. అమృత్‌ పథకంకు చిహ్నంగా కావలి ట్రంకు రోడ్డులో తహసీల్దారు కార్యాలయం పక్కన నిర్మించిన పైలాన్‌ను రాత్రికి రాత్రి కూల్చివేసినా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర, నేతలు గుం టుపల్లి రాజకుమార్‌ చౌదరి, కాకి ప్రసాద్‌, మొగిలి కల్లయ్య, కవితా ప్రసాద్‌, తటవర్తి వాసు, పల్లపు మోహన్‌, గుంటుపల్లి నాగేశ్వరరావు, ఆత్మకూరి నాగరాజు, చవల రామకృష్ణ, పులివర్తి రాజా పాల్గొన్నారు.


ఆర్డీవోకు ఏపీ ఎన్జీవో నేతల సత్కారం

కావలి టౌన్‌ : కావలి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన జీ శ్రీనివాసులును సోమవారం ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యా ద పూర్వకంగా కలసి సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అసో సియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు శివకుమార్‌, హమీద్‌, వెంకటేశ్వర్లు, ఉమా శంకర్‌, నర్సారెడ్డి, అశోక్‌, పెంచలయ్య, దీక్షితులు, ప్రసూన పాల్గొన్నారు.


ఆర్డీవోను కలిసిన బీజేసీ నేతలు

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో జీ శ్రీనివాసులను మర్యాదపూ ర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పీ.సుభాషిణి, నేతలు మురళి, కిరణ్‌ కుమార్‌, విజయ్‌కుమార్‌, ఖాదర్‌బాషా, సింహాద్రి, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T09:38:10+05:30 IST