సామాజిక భద్రత బీమా సౌకర్యాలను వినియోగించుకోండి

ABN , First Publish Date - 2020-10-13T12:10:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న సామాజిక భద్రత బీమా సౌకర్యాల ను వినియోగించుకోవాలని నిడిగుంటపాళెం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ సీతారామ్మూర్తి ఖాతాదారులను కోరారు.

సామాజిక భద్రత బీమా సౌకర్యాలను వినియోగించుకోండి

వెంకటాచలం, అక్టోబరు 12 : కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న సామాజిక భద్రత బీమా సౌకర్యాల ను వినియోగించుకోవాలని నిడిగుంటపాళెం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ సీతారామ్మూర్తి ఖాతాదారులను కోరారు.  ఆర్థిక, డిజిటల్‌ అక్షరాస్యతపై  సోమవారం నిడిగుంటపాళెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా పొందిన రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించి రుణ పరపతిని పెంపొం దించుకోవాలన్నారు.


అనంతరం కళాజాతా బృందం పాటల ద్వారా బ్యాంకు అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు నేటపాటి శ్రీనివాసులు, ఫీల్ట్‌ ఆఫీసర్‌ రమేష్‌, యు.ఎస్‌ సిబ్బంది హేమ ప్రసన్న, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T12:10:30+05:30 IST