-
-
Home » Andhra Pradesh » Nellore » nlr news
-
రుణాలు ఇప్పిస్తామని మోసం!
ABN , First Publish Date - 2020-10-07T07:58:17+05:30 IST
‘‘ఒకటీ రెండు కాదు.. 59 బ్యాంకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. మీకు లోన్లు కావాలా. రండి ఇప్పిస్తా. అయితే, రూ.లక్షకు 10 శాతం కమీషన్ ఇవ్వాలి.’

రూ.లక్షకు 10 శాతం కమీషన్ వసూలు
రోజులు గడుస్తున్నా రాని లోన్లు
బాధితుల ఆందోళన.. పోలీసుల అదుపులో నిర్వాహకుడు
నెల్లూరు (క్రైం), అక్టోబరు 6 : ‘‘ఒకటీ రెండు కాదు.. 59 బ్యాంకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. మీకు లోన్లు కావాలా. రండి ఇప్పిస్తా. అయితే, రూ.లక్షకు 10 శాతం కమీషన్ ఇవ్వాలి.’’ అని నమ్మబలికాడు. ‘‘లోన్లు వస్తాయి కదా అని కమీషన్లు ఇస్తే లోన్లు ఇప్పించకుండా తిప్పుకుంటున్నాడు.’’ అంటూ బాధితులు మంగళవారం ఆ కన్సల్టెన్సీ సంస్థ ఎదుట నిరసనకు దిగారు.
బాధితుల సమాచారం మేరకు... దర్గామిట్ట పోలీసుస్టేషన్ పరిధిలో క్యాపిటల్ ట్రీ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులు పలువురికి లోన్లు ఇప్పిస్తామంటూ ఫోన్లు చేసి నమ్మించారు. రుణాలు అవసరమని కన్సల్టెన్సీ వద్దకు వెళ్లిన వారి నుంచి రూ.లక్షకు 10 శాతం కమీషన్ వసూలు చేశారు. అయితే, రోజులు గడుస్తున్నా కన్సల్టెన్సీ నిర్వాహకులు రుణాలు ఇప్పించక పోవడంతో మంగళవారం బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సంస్థ నిర్వాహకుడు అల్లాభక్షును దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.