వ్యవసాయానికి మీటర్లపై అపోహలు వద్దు
ABN , First Publish Date - 2020-10-04T07:12:05+05:30 IST
డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయాధికారులకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్సా ర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకంపై అవగాహన సదస్సు జరిగింది.
ఆత్మకూరు, అక్టోబరు 3: డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయాధికారులకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్సా ర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఆర్డీవో సువర్ణమ్మ మాట్లాడుతూ వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు మీటర్లు ఏర్పాటుపై రైతుల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాలని సూచించారు. విద్యుత్ ఏడీ రవినారాయణ పథకం విధి విధానాలను వివరించారు.
మీటరు ఏర్పాటు చేయడం వల్ల రైతుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందే తప్ప ఎలాంటి నష్టం, భారం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు కృష్ణప్రసాద్, ఏపీఎస్‌పీడీసీఎల్ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.