మంచి ప్రవర్తన అలవర్చుకోవాలి : డీఎస్పీ
ABN , First Publish Date - 2020-10-04T06:58:23+05:30 IST
నేరాలకు పాల్పడి సమాజంలో, పోలీసుల దృష్టిలో అవహేళన పడుతున్న వారు ఇకనైనా మంచి ప్రవర్తన అలవర్చుకుని జీవించాలని కావలి డీఎస్సీ ప్రసాద్ హితభోద చేశారు.
బిట్రగుంట, అక్టోబరు 3: నేరాలకు పాల్పడి సమాజంలో, పోలీసుల దృష్టిలో అవహేళన పడుతున్న వారు ఇకనైనా మంచి ప్రవర్తన అలవర్చుకుని జీవించాలని కావలి డీఎస్సీ ప్రసాద్ హితభోద చేశారు. బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప పోలీసు స్టేషన్లో ఎస్సై సుమన్ ఆధ్వ ర్యంలో రికార్డులో ఉన్న పాత నేరస్థులకు శనివారం ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. మండలంలో వివిధకేసులో 245 మంది పాత ముద్దాయిలు ఉండగా వారిలో 10 మంది మృతి చెందారని కొందరు అనారోగ్యం, వృద్ధాప్యంతో రాలేకపోగా 115 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వారం రోజులుగా కావలి సీఐ అక్కేశ్వరరావు ప్రత్యేక డ్రెవ్ నిర్వహించి పాత నేరస్థుల పూర్తి వివరాలు సేకరించడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు.