ఎస్‌ఈబీ ఏఎస్పీగా శ్రీలక్ష్మి

ABN , First Publish Date - 2020-10-01T09:04:18+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అదనపు ఎస్పీగా కే శ్రీలక్ష్మిని నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. తెనాలి డీఎస్పీగా పని చేస్తున్న శ్రీలక్ష్మి పదోన్నతిపై నెల్లూరుకు రానున్నారు.

ఎస్‌ఈబీ ఏఎస్పీగా శ్రీలక్ష్మి

నెల్లూర్డు(క్రైం), సెప్టెంబరు 30 :  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అదనపు ఎస్పీగా కే శ్రీలక్ష్మిని నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. తెనాలి డీఎస్పీగా పని చేస్తున్న శ్రీలక్ష్మి పదోన్నతిపై నెల్లూరుకు రానున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసి 2012లో గ్రూప్‌-1 రాసి డీఎస్పీగా పోలీసు శాఖలో చేరారు.


శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె సీఐడీలో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేటాయించబడి  అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీగా, విజయవాడ మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం జరిగిన పదోన్నతుల్లో ఏఎస్పీగా నెల్లూరు ఎస్‌ఈబీకి రానున్నారు. ఇక నెల్లూరు ఎస్‌ఈబీ ఏఎస్పీగా ఉన్న ఎస్‌వి శ్రీధర్‌రావు పోలీసు హెడ్‌క్వార్టర్‌కు బదిలీ అయ్యారు.


 ఏసీబీ డీఎస్పీకి పదోన్నతి

నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా పని చేస్తున్న దేవానంద్‌ శాంతో ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ఈయనకు పోస్టింగ్‌ ఎక్కడ ఇస్తారో తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-10-01T09:04:18+05:30 IST