కాలగర్భంలో కలిసిన టీబీ ఆసుపత్రి
ABN , First Publish Date - 2020-03-02T11:12:50+05:30 IST
కాలగర్భంలో కలిసిన టీబీ ఆసుపత్రి

ఎంతోమంది వదాన్యుల ఆశయానికి గండి
నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), మార్చి 1 : నెల్లూరు లోని పొదలకూరురోడ్డులోగల టీబీ ఆసుపత్రి కాలగర్భంలో కలిసిపోయింది. దాదాపు అర్ధ శతాబ్దంపాటు సేవలందించిన ఈ ఆసుపత్రి ఇటీవలే నేలమట్టం అయింది. దాదాపు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణం కలిగి, టీబీ రోగులను దశల వారీగా వార్డుల నిర్మాణం, ఆసుపత్రి భవనం, ఆపరేషన్ ఽథియేటర్ లను అప్పటి నగర ప్రముఖులు ముందుకు వచ్చి నిర్మించి నవే. నగర వసతులు, రోగులకు ఆధునిక సౌకర్యాలను ఎంతో మంది దాతల కుటుంబాటు అందచేసిన విరాళాలతోపాటు ప్రభుత్వం కొంత ఆర్ధిక సాయం చేసి చేపట్టినవే. ప్రధాన కార్యాలయాలు, వార్డులు అప్పటి నగరంలో పెద్ద కుటుంబాలైన తిక్కవరపు, దొడ్ల, మహబూబ్‌ఖాన్ లాంటి సంపన్నులు నిర్మించినవే. టీబీ ఆసుపత్రిగా నామకరణం చేసింది ప్రభుత్వమే. ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ఆయా కుటుంబాలే ముందుకు వచ్చి స్థలం అందించాయి. టీబీ రోగులకు అవసరమైన సర్జరీలు కూడా ఇక్కడే చేసేవారు. డాక్టర్ రాంగోపాల్ మొదటి సూపరింటెండెంట్‌గా నియమితు లు కాగా, డాక్టర్ గోవిందుస్వామి మొదట సర్జన్‌గా పనిచేశారు. మంచి వెలుతురు, గాలి, విశాలమైన స్థలం.. తదితర వసతులతో నిర్మితమైన ఈ ఆసుపత్రి స్థలాలను, భవనాలను ఇప్పటికే జిల్లా పరిషత్, విద్యుత్ శాఖలకు కేటాయించారు. వారు భవనాలు, సబ్ స్టేషన్లు నిర్మించారు. మరి కొంత ఆక్రమణకు గురైంది. చివరకు టీబీ ఆసుపత్రిని అక్కడ న ఉ ంచి తరలించడంతో వదాన్యుల ఆశయం, సంకల్పానికి బీటలు వారాయి.